ఎన్ఎంఎంఎస్ లో జక్కాపూర్ విద్యార్థుల సత్తా
On
విశ్వంభర,సిద్దిపేట: నారాయణరావుపేట మండలం జక్కాపూర్ జడ్పీహెచ్ఎస్ కు చెందిన 9 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ నకు అర్హత సాధించారు. పాఠశాల నుంచి 9మంది విద్యార్థులు ఎన్నిక కావడంపై ప్రధానోపాధ్యాయురాలు కొమ్మూరి పద్మ హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థులను అభినందించారు. గత ఆరేండ్ల నుంచి ఎన్ఎంఎంఎస్ లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న జక్కాపూర్ ఉపాధ్యాయ బృందానికి పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాభిమానులు అభినందనలు తెలిపారు. ఎన్ఎంఎంఎస్ కు ఎంపికైన విద్యార్థులు ప్రతీ సంవత్సరం రూ.12 వేల ఉపకార వేతనం నాలుగేండ్ల పాటు అందుకోనున్నారు.



