''ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు  చేస్తాం'' 

''ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు  చేస్తాం'' 

 విశ్వంభర, సూర్యాపేట: మున్సిపల్ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, సూర్యాపేట సమగ్ర అభివృద్దికి కాంగ్రెస్  పార్టీ కట్టుబడి ఉందని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,  మార్కెట్ కమిటీ ఛైర్మన్  కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్  ఛైర్ పర్సన్  మొరిశెట్టి నివేదిత లక్షాది  అన్నారు. సూర్యాపేట 34వ వార్డు హ్యూబర్ట్ నగర్, 60 ఫీట్ల రోడ్ ను కలిపే కల్వర్ట్  నిర్మాణానికి ప్రతిభ కాలేజ్ పక్క సందులో  సోమవారం మున్సిపల్  ఛైర్ పర్సన్   మొరిశెట్టి నివేదిత లక్షాది శంకుస్ధాపన చేశారు.  ఆక్స్ ఫర్డ్ స్కూల్ నుండి డి మార్ట్ రోడ్ ను కలిపే కల్వర్టు నిర్మాణానికి కూడా  శంకుస్థాపన చేశారు. ‌రెండు కల్వర్టులు గత ముప్పై సంవత్సరాల నుండి  పెండింగ్ లో వుండగా, తాను మున్సిపల్ చైర్మన్ గా గెలిచిన వెంటనే మొదటి శంకుస్థాపన కార్యక్రమంగా మున్సిపల్   ఛైర్ పర్సన్  నివేదిత లక్షాది చేపట్టడంతో స్థానిక ప్రజలు  హర్షం వ్యక్తం చేశారు. ముప్పై సంవత్సరాల నుండి తాము కల్వర్ట్ నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నప్పటికి, ఈ రోజు తమ కల నేరవేరిందని వారు అన్నారు. అనంతరం వాసవి మాత ఆలయం వెనక రోడ్డు కు, స్థానిక 37  వ వార్డులో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్  మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్ లు నాగుల వాసు,  బైరు శైలేందర్, పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మాజి మున్సిపల్ ఫ్లోర్ లీడర్  కక్కిరేణి శ్రీనివాస్, బైరు వెంకన్న,  దంతాల వీరయ్య, ఆలేటి మాణిక్యం, నేరెళ్ల మధు, రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags: