వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి
విశ్వంభర, మహేశ్వరం : వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట డెస్క్ జర్నలిస్ట్ లకు , వర్కింగ్ జర్నలిస్టుల అందరికి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్యతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘు హాజరైయారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు గణేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా రఘు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల సమస్యలనుపరిష్కరించేందుకు కృషి చేస్తానని, రెట్టింపు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని చెప్పి నేడు ఉన్నవాటిలో ఎందుకు కోతలు విధిస్తుదని ప్రశ్నించారు. జర్నలిస్టులను ఉద్ధరిస్తున్నామని చెప్పుకుంటూ కొత్త జీవోలు తీసుకొచ్చి వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వకుండా కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ జర్నలిస్టుల ఏరి వేత పేరుతో వర్కింగ్ జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గం మున్సిపాలిటీ మండలలో పనిచేసే జర్నలిస్టులతో పాటు డెస్క్ లో పనిచేసే వారికి కూడా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టులకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించార. జీఓ 252 సవరించాకే అక్రిడిటేషన్ కమిటీని నియమించాలని జిల్లా అద్యక్ష, కార్యదర్శులు ఎస్.గణేష్, యం.సైదులు జిల్లా కలెక్టర్, డీపీఆర్వో లను డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252 వర్కింగ్ జర్నలిస్టులు నష్ట పోతున్నార న్నారు, జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకుండా కోతలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ మరోసారి వర్కింగ్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డు లు వచ్చేలా జీవో ను సవరించిన తర్వాతే అక్రిడిటేషన్ కమిటీని నియమించాలని, లేదంటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు, అనంతరం డిఆర్ఓ, డీపీఆర్వో లకు వినతిపత్రం అందజేశారు. , ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చంద్ర శేఖర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలువేరు సురేష్, ఎండి కాజా పాషా, జిల్లా డెస్క్ జర్నలిస్ట్ లు సంఘం రాష్ట్ర నాయకులు అజయ్ కుమార్, రాజేందర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేష్, సుదర్శన్, మణి, నర్సింహారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు క్రాంతి, అంజి, శ్రీశేలం, శ్రీనివాస్, శివ, నియోజకవర్గాల అధ్యక్ష కార్యదర్శులు పల్లటి జగన్, రాఘవేందర్ గౌడ్, శంకర్, సురేందర్, నర్సింహా, భూచ్చన్న, భగవంతు, జర్నలిస్టులు పాల్గొన్నారు.



