రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమం.

రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమం.

విశ్వంభర, రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీల అమలు కోసం, స్థానిక సంస్థల్లో, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్స్ సాధన కోసం పోరాటాలు ఉదృతం చేస్తామని, ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో, రామన్నపేట మండల కేంద్రంతో పాటు వెల్లంకి గ్రామంలో ఎన్.పి.ఆర్.డి 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చేశారు. ఈ సందర్బంగా ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర ఉపాధ్యక్షులు వనం ఉపేందర్  మాట్లాడుతూ జాలి, దయ, కరుణ మాకొద్దు, మా హక్కులు మాకు కావాలి అంటూ దేశ వ్యాప్తంగా వికలాంగులను ఐక్యం చేయడానికి 2010 ఫిబ్రవరి 21-22 తేదీల్లో ఎల్ పి ఆర్ డి కలకత్తా పట్టణంలో ఏర్పడిందని, ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం వికలాంగులను సమీకరించి పోరాటాలు చేస్తుందని అన్నారు. పార్లమెంట్ వేదికగా వికలాంగుల సమస్యలను చర్చించి అనేక సమస్యలను పరిష్కారం చేసేందుకు కృషి చేసిందని అన్నారు. 2016 ఆర్.పీ.డి చట్టం సాధన, అంత్యోదయ రేషన్ కార్డ్స్, రైల్వేలో సౌకర్యాలు, సామూహిక ప్రాంతాలు అవరోధ రహితంగా మార్చడం, నేషనల్ ఇన్స్టిట్యూట్ విలీననికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి విజయాలు సాధించిందని అన్నారు. మహిళా వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలు చేసిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి రామన్నపేట మండల గౌరవ అధ్యక్షులు బొడ్డుపల్లి వెంకటేశం, మండల ఉపాధ్యక్షులు నాగు నరసింహ, మండల నాయకులు పున్న శ్రీధర్, నోముల రవి వర్మ, శివ, ఉదయ్, బీరప్ప, మల్లమ్మ, కోనూరు వెంకటేశం, కే.శీను, నరసింహ, వెల్లంకి గ్రామ నాయకులు తాటిపాముల జంగయ్య, ఆవనగంటి నాగేష్, గూని నరసింహ, జెల్లా ఉపేందర్, జెల్లా శ్రీరాములు, మూడ నరసమ్మ,  మూడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: