వైద్య వృత్తి చాలా గొప్పది: స్పీకర్ గడ్డం ప్రసాద్.

వైద్య వృత్తి చాలా గొప్పది: స్పీకర్ గడ్డం ప్రసాద్.

విశ్వంభర, ఎల్బీనగర్ : వైద్య వృత్తి చాలా గొప్పదని, ప్రకృతి వైద్యం నుండి రోబోటిక్ వైద్యం వరకు గత వేల సంవత్సరాల నుండి ఎంతోమంది వైద్య ప్రముఖుల కృషితోనే  వైద్యరంగం లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ఓజోన్ హాస్పిటల్ 12వ వార్షికోత్సవ వేడుకలకు హాస్పిటల్ చైర్మన్ సత్య సాయి ప్రసాద్, ఎండి దీప్తి తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుందని ముఖ్యంగా హైదరాబాద్ వైద్యరంగంలో ముందున్నదని అన్నారు. అత్యంత నాణ్యమైన వైద్యం తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులో ఉందని అన్నారు. వైద్య వృత్తిని మానవతా కోణంలో చూస్తున్న ఓజోన్ హస్పటల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా పేదవారికి నగదు రహిత రూపంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించబడుతున్నాయని వీరు అందిస్తున్న నార్సింగ్ ,పారామెడికల్స్, వృత్తి నైపుణ్యాన్ని పెంచి వారికి అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శ్రీనివాసరావు, ఎండి మధుసూదన్ రెడ్డి, డాక్టర్లు, నర్సింగ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: