బ్రాహ్మణ కొత్తపల్లిలో అగ్నిప్రమాదం

బ్రాహ్మణ కొత్తపల్లిలో అగ్నిప్రమాదం

  • దగ్ధమైన రైతుల వ్యవసాయం పరికరాలు

విశ్వంభర, నెల్లికుదురు: పొలాలు, చెలకల గట్లపై ఉన్న చెత్తను తొలగించడానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అది కాలుతూ ఉగ్రరూపాన్ని సంతరించుకొని ఊరునే దగ్ధం చేయాలని చూసిన సంఘటన నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లిలో చోటుచేసుకుంది. గ్రామంలోనికి మంటలు ప్రవేశిస్తున్న సమయంలో ఓ వ్యక్తి సర్పంచికి ఫోన్ చేసి చెప్పాడు.వెంటనే స్పందించిన సర్పంచి చిర్ర యాకాంతం గౌడ్, ఎస్సై చిర్ర రమేష్ బాబులు జిల్లా కేంద్రం మహబూబాబాద్, మరిపెడ ఫైర్ స్టేషన్లకు సమాచారం దించారు. హుటాహుటిన ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలను గ్రామంలోకి ప్రవేశించకుండా ఆర్పి వేశారు. అనంతరం పొలాలలోని మంటలు చల్లార్చరు. అప్పటికే రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రైతు బొల్లు చంద్రయ్య కు చెందిన స్టార్టర్ వైరు కాలిపోయి రూ.10 వేలు, బొల్లు రాజేష్ రూ.50 వేల విలువ గల డ్రిప్, బొల్లు రమణ రూ.80 వేల విలువ పల్సర్ బైక్, పైపులు, కొంపల్లి శ్రీశైలం రూ. 40 వేల డ్రిప్పు వైరు పూర్తిగా కాలిపోయి నష్టం జరిగింది. 

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి :సర్పంచి డా. యాకాంతం గౌడ్

Read More నిధులు ఉన్నా రోగులకు తప్పని తిప్పలు 

అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన పలువురు రైతులకు చెందిన సాగుకు ఉపయోగపడే డ్రిప్ లు,పైపులు, వైరు, బైక్ కాలి బూడిదై అపార నష్టం జరిగిందని స్థానిక సర్పంచి డా.చిర్ర యా కాంతం ఆవేదన వ్యక్తం చేశారు.నష్టపోయిన రైతులకు సహకారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నెల్లికుదురులో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

🕒 19 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/fire-in-brahmin-kothapalli/article-15397

Tags: