ప్రతిభ వెలికి తీయడానికే సమ్మర్ క్యాంపులు
విశ్వంభర,నెల్లికుదురు:ప్రభుత్వం పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ లలో ఏర్పాటు చేస్తున్న సమ్మర్ క్యాంపు లతో విద్యార్థులలోని ప్రతిభ మరింత పెంపొందుతుందని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు.కార్పొరేట్ ఎడ్యుకేషన్ కు ధీటుగా ప్రభుత్వ విద్యా రంగం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తన కోరిక మేరకు నెల్లికుదురులో సకల సౌకర్యాలతో పబ్లిక్ పాఠశాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను సైతం తీసుకు వస్తున్నట్లు చెప్పారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ విద్యా వారోత్సవాలలో భాగంగా స్థానిక పీఎంశ్రీ టీజీ మోడల్ స్కూల్ లో సోమవారం డీఈవో సత్యనారాయణ మూర్తి,ఏజిసిఈ శ్రీరాములు, ఎంఈఓ రాందాస్ ల తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు. ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం తరహాలో విద్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచినట్లు చెప్పారు.ఉదయం మంచి అల్పాహారం,మెనూ ప్రకారం భోజనాలు అందిస్తున్నట్లు తెలిపారు. స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థుల రాకపోకలకు ఒక్కో విద్యార్థికి రూ.6 వేల చొప్పున 69 మందికి డబ్బులు చెల్లించినట్లు పేర్కొన్నారు. వేసవి సెలవులలో బాలబాలికలకు ఇంటి వద్దనే స్వేచ్ఛాయుతంగా గడపాలని ఉన్నప్పటికీ సమ్మర్ క్యాంపులలో వాలీబాల్,యోగ,క్లాసికల్ డాన్స్ కబడ్డి,క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ వంటి వాటిలో శిక్షణ ఇవ్వడంతో జీవితంలో ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు అభ్యర్థన మేరకు తరగతి గదులలోకి కోతులు రాకుండా ఉండేందుకు గ్రిల్స్ ఏర్పాటుకు తన పండు నుంచి రూ.3.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.కార్యక్రమంలో ఎంపీడీవో సింగారపు కుమార్,సర్పంచులు పులి వెంకన్న,గుగులోతు అశోక్ కుమార్,వీరన్న,సోమన్న,రామ్ సింగ్, నాయకులు యాదవ రెడ్డి,ప్రభాకర్ గౌడ్, బాలాజీ,లక్ష్మారెడ్డి, మహిళా నేత హెచ్చు అలివేలు, వివిధ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.