నాలుగో నంబర్ ఫ్లాట్ ఫారం నిర్మించాలి

నాలుగో నంబర్ ఫ్లాట్ ఫారం నిర్మించాలి

విశ్వంభ్రర, మహబూబాబాద్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్ నాలుగో నంబర్ ఫ్లాట్ ఫారం నిర్మించాలని రైల్వే కన్ స్త్రక్షన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ కు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, కాగ్రెస్ నేత శంతన్ రామరాజు వినతిపత్రం అందజేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం గుండా నూతనంగా నిర్మాణం చేస్తున్న మూడో రైల్వే లైన్ కు అనుసంధానంగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ శ్రీనివాస సెంటర్ వైపు నాలుగో నంబర్ ఫ్లాట్ ఫారం నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం  రైల్వే నిర్మాణపనుల పర్యవేక్షణలో భాగంగా మానుకోటకు వచ్చిన రైల్వే కన్ స్ట్రక్షన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ గంటా శ్రీనివాస్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడుతూ వెస్ట్ బుకింగ్ ముఖాద్వారం కోర్టు సెంటర్ వైపు ఏర్పాటు చేయాలనీ, రైల్వే మూడో లైన్ కు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో నాలుగో ఫ్లాట్ ఫారం తప్పనిసరిగా నిర్మించాల్సిందే అని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం ఉన్న రెండు ఫ్లాట్ ఫారాలకు అదనంగా నాలుగో ఫ్లాట్ ఫారం నిర్మించకుంటే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. శ్రీనివాస్ టాకీస్ వైపు కేవలం 120 మీట్లర్ల బేబీ ఫ్లాట్ ఫారం మాత్రమే నిర్మించి దీనికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ద్వారా మూడో నంబర్ ఫ్లాట్ ఫారం పై రైలు ఎక్కాల్సి ఉంటుందని అన్నారు. వాస్తవానికి 600 మీట్లర్ల పైగా ఫ్లాట్ ఫారం అవసరం ఉంటుందన్నారు. వరంగల్ తరహాలో పూర్తిస్థాయి ఫ్లాట్ ఫారం ఉంటేనే పిల్లలు, వృద్ధులు, గర్భిణీలకు ఇబ్బందులు తలెత్తవన్నారు. రోజూ వేలాదిమంది ప్రయాణికులు, లక్షలాది రూపాయల ఆదాయంతో అత్యంత రద్దీగా ఉన్న స్టేషన్లో పూర్తిస్థాయి మౌళికవసతుల కల్పన అత్యవసరం అని అన్నారు. ఈకార్యక్రమంలో సామాజిక ఉద్యమ నాయకులు సోమారపు వీరస్వామితో పాటు రైల్వే అధికారులు కోడారి రాధాకృష్ణ, రణదీర్ తదితరులు ఉన్నారు.

Tags: