మామునూర్ విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

హర్షం వ్యక్తం చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు

మామునూర్ విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం

విశ్వంభర, వరంగల్ జిల్లా : మామునూరు విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన తరుణంలో వరంగల్ జిల్లా ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సందర్బంగా హమమకొండ డిసిసి భవన్ నందు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు & వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  అధ్యక్షతన నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఎంపీ  కడియం  కావ్య,  ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య , సహచర ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.  అనంతరం ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్యేలతో  కలసి వరంగల్ ఎయిర్పోర్ట్ అనుమతులు తీసుకరావడం కోసం కృషి చేసిన  సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వీట్ పంపిణి చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.

అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు  మాట్లాడుతూ:-

Read More యూత్ అధ్యక్షులుగా గడెల ప్రశాంత్  

వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మామూనూరు ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్కి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కి.మీ పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జీఎంఆర్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. దీంతో మామునూరుకు జీఎంఆర్ అంగీకారం తెలిపిందన్నారు....
ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే జీవో విడుదల చేసింది. ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపీఆర్ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్టు అథారిటీకి రోడ్లు, భవనాల శాఖ లేఖ రాసింది. మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కి. మీ. ఒప్పందాన్ని జీఎంఆర్ సంస్థ విరమించుకుంది. ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిలో కొంత రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), నేవిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ వెల్లడించింది అన్నారు.

మమూనూరు విమానాశ్రమం రైతులతో  పరకాల ఎంఎల్ఏ రేవూరి ప్రకాశ్ రెడ్డి నేను స్వయంగా రైతులతో మాట్లాడి వారి ఒప్పించి మీకు తగిన న్యాయం చేస్తాం అన్నారు.

నిజాం కాలంలో మామునూరు నుంచి వాయుదూత్ విమానాలు నడిచేవి. భారత్, చైనా యుద్ధ సమయంలో కీలక సేవలందించాయి. దాదాపు 32 ఏళ్ల కిందట మూతపడిన మామునూరు విమానాశ్రయానికి మళ్లీ 'రెక్కలు' రానున్నాయి. అప్పుడప్పుడు శిక్షణ ఎయిర్ క్రాఫ్ట్లు నడుస్తున్న ఈ విమానాశ్రయం నుంచి మళ్లీ విమానం ఎగరనుంది అన్నారు.

కాంగ్రేస్ పార్టీ ని పాకిస్తాన్ తో  పోల్చడం చాలా బాధాకరం. ఢిల్లీ లో అంబేద్కర్ బొమ్మ తీసివేయడం చాలా దుర్మార్గం. మా నాయకులు గ్రౌండ్ నుండి వచ్చాడు. విద్య, వైద్యం మీద కూడా చాలా ఇంట్రెస్ట్ చూపెటడుతున్నాము. రైతు రుణమాఫి అన్నీ చేస్తున్నాము. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు ఆస్తులు కూడా బెట్టుకున్నారు.

మా సీఎం, డిప్యూటీ సిఎం మంత్రులు ఒక గొప్ప నిబద్దతో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు అన్నారు....
మా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరం కలిసి కట్టుగా పని చేస్తున్నాము అన్నారు ...
వరంగల్ సీపీ అంబర్ కిషోర్ జా  కి విజప్తి చేస్తున్న మొన్న ఎలక్షన్ కోడ్ ఉన్న కూడా బిజెపి నాయకులు టెంటులు వేసుకొని సంబరాలు జరుపుకున్నారు వారి  మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తునన్నారు 
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు చేసి పెట్టుబడిదారులను సకల సౌకర్యాలు కల్పిస్తడం తో సౌత్ కొరియా దేశం నుంచి పెట్టుదారులు పెట్టేందుకు వస్తున్నారు అన్నారు....

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ, కూడా చైర్మన్ ఇనుగల వెంకట్రామిరెడ్డి, తో పాటు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల,  డివిజన్, స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ...

Tags: