డా. రాజేశంకు ద బెస్ట్ టీబీ ఎలిమినేషన్ అవార్డు

డా. రాజేశంకు ద బెస్ట్ టీబీ ఎలిమినేషన్ అవార్డు

 విశ్వంభర, బషీర్ బాగ్ : ప్రపంచ వ్యాప్తంగా క్షయ వ్యాధి ఒక ముఖ్యమైన ఆరోగ్య సవాలుగా కొనసాగుతుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ మాజీ చైర్మన్ న్యాయమూర్తి జస్టిస్ వామన్ రావు అన్నారు. మంగళవారం తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కోటీలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ క్యాంపస్ లోని రాష్ట్ర క్షయ వ్యాధి నియంత్రణ కార్యాలయంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. క్షయ వ్యాధిని అంతం చేయడం సాధ్యమేనని అయితే ముందస్తు రోగ నివారణ, సమర్థవంతమైన చికిత్స సమాజ భాగస్వామ్యం ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర క్షయవ్యాధి నియంత్రణ అధికారి, జాయింట్ డైరెక్టర్ క్షయ వ్యాధి ట్రైనింగ్, డిమాండ్ స్టేషన్ సెంటర్ డాక్టర్ ఆడేపు రాజేశం మాట్లాడుతూ రెండు మూడు వారాల కంటే ఎక్కువ కాలం ఉండే దగ్గు, రక్తంతో కూడిన కఫం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గటం, సాయంత్రం వేళ జ్వరం అలసట రావడం, ఊపిరితిత్తు లలో చాతి నొప్పి శ్వాసకోశ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వీటిని క్షయ వ్యాధి లక్షణాలని దీనిని ఆరు నెలలు క్రమం తప్పకుండా ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఇచ్చే మందులను వాడితే నయమవుతుందని ఉదాహరణలతో వివరించారు.  తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ క్షయ వ్యాధి బారిన పడినవారు సరిగా గుర్తించకపోవడం, వైద్యుల సలహాలు పాటించకపోవడం, సరైన చికిత్స  తీసుకోకపోవడం  వంటి కారణాలతో  మళ్లీ వ్యాప్తి చెందుతుందని, క్షయ వ్యాధి నివారణకై ప్రభుత్వం ఆసుపత్రుల్లో ఉచితంగా ఔషధాలు అందరికీ సరఫరా చేస్తున్నారని వివరించారు.  గత 25 సంవత్సరాలుగా క్షయ వ్యాధి నియంత్రణకై కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర క్షయ వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఏ రాజేశం కు ద బెస్ట్ టిబి ఎలిమినేషన్ అవార్డు 2026 ను జస్టిస్ వామన్ రావు అందజేసి  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లు వైద్య సిబ్బంది డాక్టర్ ఆదిత్య, నీరజ, జితేంద్ర, రవికుమార్, శ్రీనివాస్,టిసిసి కోఆర్డినేటర్లు శ్రీజి, వేణుగోపాల్ బిచ్చుకారి సూర్య తదితరులు పాల్గొన్నారు.

Tags: