హత్య కేసును ఛేదించిన నందిపేట్ పోలీసులు
- భార్య, కుమారుడే హత్యచేసినట్లు నిర్ధారణ
- తల్లి, కొడుకు అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి
.విశ్వంభర, నిజాబాద్: ఓ వ్యక్తి హత్య కేసును ఎట్టకేలకు నందిపేట్ పోలీసులు ఛేదించారు. కట్టుకున్న భర్తనే కొడుకుతో కలిసి భార్య దారుణంగా చంపేసిన సంఘటన నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాయాపూర్ లో ఈనెల 5వ తేదీన చోటు చేసుకుంది. ఈ హత్యకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గ్రామానికి చెందిన పుంటికూర ముత్యం అనుమానాస్పద మృతి చెందిన కేసు ను నందిపేట్ పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో మృతుడి భార్య పుంటికూర లలిత (38), కుమారుడు (17) కుటుంబ ఆర్థిక సమస్యలు మృతుడి అక్రమ సంబంధ వ్యవహారాల కారణంగా ముత్యంను హత్య చేసినట్లు వెల్లడైందన్నారు. ఈనెల 5వ తేదీన ముత్యం మద్యం సేవించి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, లలిత చీర అంచు తో మెడ బిగించి హత్య చేయగా, కుమారుడు కాళ్లు పట్టుకొని సహకరించినట్లు విచారణలో ఒప్పుకున్నారు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా మద్యం మత్తులో మంచం మీద నుండి పడిపోయి చనిపోయినట్లుగా నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. మృతుడి కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీస్ విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితురాలు పుంటికూర లలిత, ఆమె కొడుకును కోర్టు లో హాజరు పరిచినట్లు తెలిపారు.
నేరానికి ఉపయోగించిన చీర , చెద్దరి, కత్తెరను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో నందిపేట ఎస్సై శ్యామ్ రాజ్ పాల్గొన్నారు.