మిద్దెల జితేందర్ ను ఘనంగా సన్మానించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్  స్టేట్ సెక్రటరీ కొదుమూరి దయాకర్ 

మిద్దెల జితేందర్ ను ఘనంగా సన్మానించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్  స్టేట్ సెక్రటరీ కొదుమూరి దయాకర్ 

విశ్వంభర, హైద్రాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులుగా మిద్దెల జితేందర్  భాద్యతలు స్వీకరించి నేటికీ సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్బంగా  గాంధీభవన్ లొ సేవాదళ్ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్  స్టేట్ సెక్రటరీ కోదుమూరి దయాకర్ ఆయనను శాలువాతో సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ సందర్బంగా దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ముఖ్య లక్ష్యంగా మిద్దెల జితేందర్ నాయకత్వంలో సేవాదళ్ కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. బ్రిటిష్ వలస పాలకులను తరిమికొట్టి భారతదేశానికి  స్వాతంత్రం తెచ్చి పెట్టిన సంస్థలలో  ముఖ్యమైన సంస్థ సేవాదళ్ అని కొనియాడారు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన అఖిల భారత కాంగ్రెస్ సేవాదల్ లొ నేను పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని కోదుమూరి దయాకర్ అన్నారు

Read More  ప్రముఖ సినీ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత 

WhatsApp Image 2024-08-24 at 15.23.40

Tags: