సామాజిక కార్యకర్త గురిజ మహేష్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం
విశ్వంభర, నాంపల్లి :- సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటున్న ఈరోజున ప్రభుత్వ ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్త గురిజ మహేష్ ఆధ్వర్యంలో పెట్లోజు శరత్ వారి తల్లి ఉమాదేవి జ్ఞాపకార్థం పాఠశాలకు అందజేసిన ఆర్థిక సహకారంతో పాఠశాల ఉపాధ్యాయులందరినీ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు,సామాజిక కార్యకర్త గురిజ మహేష్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ దేశానికి అందించిన సేవలను విద్యార్థులకు వివరించి, ఉపాధ్యాయుల సేవలను విద్యార్థులు గుర్తించి వారిని తగిన విధంగా గౌరవించాలని, విద్యార్థులు కష్టపడడి చదివి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగి తల్లిదండ్రులను మంచిగా చూసుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చి దేశాభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందా రాజశేఖరం సర్వేపల్లి రాధాకృష్ణ గారి సేవలను,పాఠశాల ఉపాధ్యాయుల సేవలను, ఉపాధ్యాయుల పనితీరును కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చందా రాజశేఖరం, ఉపాధ్యాయులు యాదయ్య, ఇమామ్, వెంకటరమణ, శ్రీహరి, మహేష్, ఉజ్వల,శ్రవణ్, శిరీష, రవి, సాజిదా బేగం మరియు విద్యార్థులు పాల్గొన్నారు