విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
- బహుజన ప్రజాశక్తి రాష్ట్ర కన్వీనర్ నల్ల లక్ష్మన్
విశ్వంభర, ముషీరాబాదు: విద్యాహక్కు చట్టం 2009 పటిష్టంగా అమలు చేసి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పేద విద్యార్ధులకు న్యాయం చేయాలని బహుజన ప్రజాశక్తి రాష్ట్ర కన్వీనర్ నల్ల లక్ష్మన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం అమలు చేసేంతవరకు తమ పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. విద్యాహక్క చట్టా కొన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సిఎం రేవంత్రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డి పల్లి నుంచి ఏప్రిల్ 10న ప్రారంభమైన పేద విద్యార్థుల తల్లిదండ్రుల క న్నీటి పాదయాత్ర ముగింపు సభను బుధవారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా నల్ల లక్ష్మన్ మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్నా పాలక వర్గాల ప్రయోజనాల కోసం దళిత బహుజన విద్యార్ధుల భవిష్యత్తును తాకట్టు పెడుతూ ప్రైవేటీకరణ, ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను క్రమంగా నిర్వీర్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పెరిగిన విద్యార్ధుల సంక్యకు అనుగుణంగా ఎస్ఎస్ సి ఇంటర్, డీగ్రీ, పిజీ కళాశాలల సంఖ్య మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొరగా ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బడ్జెట్లో విద్యాకు కేటాయింపులు లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలలలో మెగా డిస్సీని ప్రకటించి అరవై ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఇచ్చిన హామి ఏమైందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు జీవనోపాధి కోసం రీజవ్ యువ వికాసం పేరిట అందిస్తామన్నా సబ్సిడి రుణాలు ఏమైయ్యాయన్నా అన్నారు. ఇప్పటికైన ప్రభుత్వ బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జి ఇటికాల రాణి, రాష్ట్ర నాయకుల నర్సింగరావు, రవి, ధృవ, గూడెల్లి శివాణి, సుధాకర్, పి. శ్రీనివాస్, రుక్మిణి, సువర్ణ, వాణి, సరస్వతి, రాములమ్మ, గురవయ్య, అర్చన కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.