మునిగలవీడు ఎస్సీ కాలనీ బోరుకు మరమ్మత్తు.
విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని మునిగలవీడు ఎస్సీ కాలనీకి నీరు సరఫరా చేసే బోరు గత పది నెలలుగా పాడైపోయి రిపేరుకు నోచుకోలేదు.గ్రామ సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు సంబంధిత బోరు మోటారు,స్టార్టర్ రిపేర్ చేయించి శనివారం బిగింప చేశారు. బోరు నీరు పడడంతో కాలనీవాసులు తమ నీటి తిప్పలు తీరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ చైతన్య మాట్లాడుతూ గ్రామ ప్రజల అవసరాలు గుర్తించి సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తున్నట్లు తెలిపారు.