శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

  • ఎంఈఓ ఆంగోత్ రాందాస్

విశ్వంభర,నెల్లికుదురు: బోధన నైపుణ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి ఆంగోత్ రాందాస్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతి గదుల్లో ఉపాధ్యాయులు బోధన వినూత్న పద్ధతిలో చేపట్టినప్పుడు విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని పాఠ్యాంశంపై విశ్లేషణ శక్తి సామర్థ్యం వృద్ధి చెందుతుందని తెలిపారు.మండల వ్యాప్తంగా ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 120 మంది సెకండరీ గ్రేడ్ టీచర్స్ లకు రెండు విడతలుగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.అనంతరం అర్పిలు చంద్రశేఖర్, లక్ష్మినారాయణ, ఫణిద్ర, రాజు,సుధాకర్ లు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు వాణిశ్రీ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మండల ఎం ఎస్ కోఆర్డినేటర్ ఎం సుధాకర్ ఐ ఈ ఆర్ పి పి యాకయ్య సీఆర్పీలు జె. కవిత బి. వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/take-advantage-of-the-training/article-19541

Tags: