రైతులను మోసం చేస్తున్న రైస్ మిలర్లపై చర్యలు తీసుకోవాలి
- సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మద్దెపురం రాజు
విశ్వంభర, గుండాల : తాలు,తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్న మోత్కూర్ రైస్ మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం గుండాలలో పత్రికా ప్రకటన విడుదల చేసి పాత్రికేయులతో మాట్లాడుతూ, మోత్కుర్ లోని ధనలక్ష్మి, పరమేశ్వరి రైస్ మిల్ యాజమాన్యం ప్రభుత్వ యంత్రాంగంతో మిలాఖతయ్యి మధ్య దళారుల ద్వారా రైతుల దాన్యం బారీ యెత్తున దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.రైతులు తమ ధాన్యపు రాసులను కొనుగోలు కేంద్రాలలో పోసి నెల రోజులుగా నిల్వ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ఆరుకాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకునేందుకు చాలా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించి నామమాత్రంగా కాంటాలు వేయటం వల్ల రైతులు రోజుల తరబడి ధాన్యపు రాసుల వద్ద పడిగాపులు పడున్నారని పేర్కొన్నారు.మండల వ్యవసాయ అధికారులు మ్యాచర్ ఏ గ్రేడ్ గా ధృవీకరించి హమాలీలు కాంటా వేసి ధాన్యం బస్తాలు లారీలలో లోడ్ చేసి రైస్ మిల్లుకు తరలించిన తరువాత రైస్ మిల్లు యజమానులు వెంటనే దిగుమతి చేయకుండా వారం రోజులు లారీ ఆపి బి గ్రేడ్ వేసి తాలు,తరుగు పేరుతో క్వింటాలుకు ఐదు కేజీలు కట్ చేసేందుకు అనుమతిస్తేనే లోడ్ దించుకుంటామని రైతులను ఇబ్బందులకు గురిచేసి మధ్య దళారీలకు ముందుగా డబ్బులు చెల్లించిన తరువాత ఓపియంస్ పై సంతకాలు చేస్తున్నారని తెలిపారు.యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెంటనే స్పందించి క్షేత్ర స్థాయిలో విచారణకు ఆదేశించి రైస్ మిల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని యెడల రైతులను కూడగట్టి బారీయెత్తున ఆందోళన పోరాట కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ట్రాన్సుపోర్టు కాంట్రాక్టర్ కాంటా వేసిన ధాన్యం బస్తాలకు సరిపడా లారీలను కల్లాల వద్దకు పంపాలని డిమాండ్ చేశారు.అకాల వర్షాలు వాతావరణ మార్పులతో దాన్యం తడిసిపోతుందనే భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారని,కొనుగోలు కేంద్రాలలో పెద్దఎత్తున నిల్వలు పేరుకుపోవడం,బహిరంగ ప్రదేశాలలో దాన్యం నిల్వ ఉంచడం వల్ల రైతులకు తీరని నష్టం జరుగుతుందని అన్నారు. మద్దత్తు ధర చెల్లించవలసిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం,అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిండం రైతులను అన్యాయం చేయడమేనని అన్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో దాన్యం రాసులు,రైస్ మిల్లులను ప్రత్యక్షంగా పరిశీలించి కొనుగోళ్ళు వేగవంతం చేసి,రైతులు నష్టపోకుండా ఆదుకోవాలని మద్దెపురం రాజు కోరారు.