నిరుపేద విద్యార్థినికి టీ ఆర్ ఫౌండేషన్ చేయూత.  మానవత్వం చాటుకున్న తడక రమేష్  

నిరుపేద విద్యార్థినికి టీ ఆర్ ఫౌండేషన్ చేయూత.  మానవత్వం చాటుకున్న తడక రమేష్  

విశ్వంభర, భూదాన్ పోచంపల్లి :- నిరుపేద విద్యార్థుల చదువు కోసం టీ ఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడు వారికి అండగా ఉంటుందని అర్బన్ బ్యాంక్ చైర్మన్, టీఆర్ ఫౌండేషన్ చైర్మన్ తడక రమేష్ అన్నారు. ఆదివారం భువనగిరి పట్టణానికి చెందిన సిరికొండ భువన కృతి నిరుపేద విద్యార్థి గత ఇంటర్మీడియట్ పరీక్షలలో 1000 మార్కులకు గాను 956 మార్కులు సాధించింది. కాగా పై చదువులు చదువుతున్న భువన కృతికి ఆర్థిక పరిస్థితి సహకరించక పోవడంతో తన పై చదువులకు కావలసిన ల్యాప్ టాప్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని స్థానిక నాయకులు టీ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ తడక రమేష్ కు తెలిపారు. వెంటనే ఆయన దానికి స్పందించి ఆదివారం స్థానిక నాయకులతో కలిసి 46వేల విలువగల ల్యాప్ టాప్ భువన కృతికి అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీ ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది నిరుపేద విద్యార్థులు చదువులో వెనుక పడకుండా తమవంతుగా వారిని ప్రోత్సహిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తు కోసం తమవంతుగా ప్రోత్సాహం అందిస్తున్నామని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు పౌండేషన్ ద్వారా నిరుపేద విద్యార్థుల కోసం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు టి.ఆర్ యువసేన అధ్యక్షుడు వలందాస్ ప్రవీణ్, నాయకులు బింగ్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Tags: