మహిళలకు మెరుగైన వైద్యం అందించాలి

మహిళలకు మెరుగైన వైద్యం అందించాలి


 విశ్వంభర,  చింతపల్లి: మహిళలకు మెరుగైన వైద్యం అందించాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు. చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని పల్లె దవాఖానానలో జన ఆరోగ్య సమితి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  ఆరోగ్య దవాఖానాలో నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించారు. మహిళలకు బీపీ పరీక్ష చేయించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి మహిళ ఆరోగ్య మహిళా వైద్య పరీక్షలు చేయించుకునేలా వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని అన్నారు. బిపి,షుగర్ ఉన్నవారికి పల్లె దవాఖానా నుంచి ప్రతి నెల మందులు అందజేయాలని చెప్పారు. రక్తహీనత ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ఐరన్, క్యాల్షియం వంటి మాత్రలు అందజేయాలని, ఐరన్ సమకూరే ఆహారాన్ని సూచించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, మాజీ ఉప సర్పంచ్లు ధరణిపతి రమణారావు, ఉలుపాల శేఖర్ రెడ్డి, తీదేడు గ్రామ శాఖ అధ్యక్షుడు సోనగంటి గొవర్థనాచారి, వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, గంటెల అలివేలు సోమయ్య, దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్ ముదిరాజ్, మర్ల యాదగిరి, శివర్ల పర్వతాలు యాదవ్, గ్రామస్తులు సిమర్ల శ్రీను యాదవ్, మెరిక శంకరయ్య, వీరమల్ల జగదీష్, దాసరి మల్లయ్య, వీరమల్ల వెంకటయ్య, మొరుపోజు రాజు, కాయితి బుచ్చిరెడ్డి, కర్ణకోట కిషన్, కలగోని కిరణ్, మునగాల అశోక్, డాక్టర్ శ్రీదేవి, ఏఎన్ఎం రామలక్ష్మి, అంగన్వాడి టీచర్లు, ఆశావర్కర్లు,  సిబ్బంది పాల్గొన్నారు.

Tags: