విద్యార్థులు చదువుతో పాటు చక్కని నడవడికను అలవర్చుకోవాలి
- : డి.ఎస్.పి తిరుపతిరావు
విశ్వంభర, మహబూబాబాద్ : విద్యార్థులు విద్యాతోపాటు ఉన్నత విలువలు వ్యక్తిత్వ వికాసంతోపాటు చక్కని నడవడికను అలవార్చుకోవాలని మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు అన్నారు. మహబూబాబాద్ లోని వర్తక సంఘ భవనంలో ( వాసవిమాత కార్పొరేషన్ ) ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన పదవ తరగతి, ఇంటర్, జేఈఈ మైన్స్ లో ప్రతిభ కనబర్చిన ఆర్య వైశ్య విద్యార్థులకు ప్రతిభ పురస్కార్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు . ఇమ్మడి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి. తిరుపతిరావు మాట్లాడుతూ.. చదువు ఉద్యోగంకోసం కాదని జీవితంలో ఎదురయ్యే ఎంతటి సమస్యనైనా ఎదురించే శక్తిని చదువు ఇస్తుందన్నారు. వి ఎం సి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు. డి ఈ ఓ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ఉన్నత భవిష్యత్తుకోసం మంచి మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, అంజలి మాట్లాడుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు పాస్ అవుతున్నారనే సంతోషంలో వారి నడవడిక గురించి పట్టించుకోవడంలేదన్నారు. ఫలితంగా పిల్లలు చెడు మార్గాలకు ఆకర్షితులై వారి బంగారు భవిష్యత్తును వారే నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై దృష్టి సారించాలన్నారు.అనంతరం పది, ఇంటర్, జేఈఈమైన్స్ లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రతిభ పురస్కార్ అవార్థులను ప్రధానం చేసారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, బి ఎం సి కార్యదర్శి వేమిశెట్టి కిరణ్ కుమార్, కోశాధికారి మాలె శ్రవణ్ కుమార్ ( చిన్నా ), మాలె నవీన్ కుమార్, పల్లెపోతుల లక్ష్మీనారాయణ, జంగాల మంగపతి, నాళ్ళ వేణుగోపాల్, మాధవరపు ప్రదీప్, మాశెట్టి రాంబాబు, మాశెట్టి అంబరీష, వందనం కమల్ తదితరులు పాల్గొన్నారు.