గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
విశ్వంభర, చింతపల్లి: గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మంగళవారం చింతపల్లి తహసిల్దార్ విజయలక్ష్మికి తెలంగాణ రాష్ట్ర గో ఆరాధన ఉద్యమ ప్రభారి రాధే స్వామి జీ (ఉత్తరప్రదేశ్ నివాసి) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఆ మేరకు గత 5 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి గోమాత విశిష్టతను ప్రజలకు వివరిస్తున్నారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరారు. గో సేవ కోసం చట్టం చేయడంతోపాటు గో సేవ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యులు శివర్ల రమేష్ యాదవ్, బీజేపీ మాజీ జిల్లా ప్రధానకార్యదర్శి చెనమోని రాములు, దేవరకొండ నగర సహకార్యవర్గ ప్రవీణ్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గొడుగు శ్రీను, బొడ్డు మహేష్, గజ్జె అభినవ్, కొప్పుల మహేష్, కడారి క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.