జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు

జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు

  • కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

విశ్వంభర, ఖమ్మం :జిల్లాలో సరిపోను గృహావసరాల వంట గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్యాస్ ఏజెన్సీ ల డీలర్ లు, గ్యాస్ కంపెనీల సేల్స్ ఆఫీసర్ లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి మాట్లాడుతూ, అమెరికా-ఇరాన్ కు జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని తెలిపారు. ఈ దిశగా అధికారులు, గ్యాస్ డీలర్లు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్యాస్ కొరత ఉందని, అవసరం లేకున్నా బుకింగ్ చేసుకోవడం, ఆందోళన చెందడం వద్దని అన్నారు. జిల్లాలో గృహ  అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలుంటాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ లకు కొరత లేదని సమావేశం లో ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు వివరించారు. ఎల్.పి.జి.  గ్యాస్ కు ఎలాంటి కొరత లేదని, అదేవిధంగా ఆసుపత్రులు, విద్యాసంస్థలు, విద్యాసంస్థలకు చెందిన వసతి గృహాలు, అంగన్వాడీ లకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి అవాంతరాలు వుండవద్దని తెలిపారు. శుక్రవారం హోటళ్ళు, రెస్టారెంట్ లు తనిఖీ చేసి గృహ వసరాలకు వాడే ఎల్.పి.జి.గ్యాస్ సిలిండర్ లను వాణిజ్య అవసరాలకు వినియోగించిన వారిపై నిత్యావసర వస్తువుల చట్టం కింద 6ఏ కేసులు నమోదు చేసినట్లు, 18 సీలండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గృహావసరాల గ్యాస్ దుర్వినియోగం, బ్లాక్ మార్కెట్ చేస్తే సహించేది లేదని, ఎస్మా యాక్ట్ ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ సమావేశం లో జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా సంక్షేమ అధికారిణి విజేత, జిల్లా ఇంచార్జ్ రవాణాధికారి శ్రీనివాసరావు, ఆయిల్ సంస్థల ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: