సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: గురు పౌర్ణమి సందర్భంగా రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొంగర కలాన్ లోని ప్రసిద్ధ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి  హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల సుఖ సంతోషాల కోసం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మాట్లాడిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, "గురువు అంటే చీకటి నుండి వెలుగులోకి నడిపించేవాడు. గురు పౌర్ణమి రోజున మన జీవితాల్లో జ్ఞాన జ్యోతి వెలిగించిన గురువులను స్మరించుకునే పవిత్రమైన రోజు. సాయిబాబా వారి బోధనలు మనకు మార్గదర్శకం. బాబా ఆశీస్సులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి) మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు, హృదయపూర్వక శుభాకాంక్షలు. సాయిబాబా వారు అందరికీ శాంతి, సద్భావన కలిగించాలని కోరుకుంటున్నాను. ప్రజా సేవయే మా ధ్యేయం. ప్రజల ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తాం అని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికి, శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కర్నాటి రమేష్, జెర్కోని రాజు, పాతూరి రాజేష్, కరుణాకర్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/special-pujas-at-saibaba-temple/article-20288

Tags: