వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలి
- ఎంపీడీవో క్రాంతి కుమార్
విశ్వంభర, పెద్ద శంకరంపేట: బుధవారం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, గ్రామాల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించాలని సూచించడం జరిగింది. అదేవిధంగా, వి బి ఆర్ ఎ ఎం జి పథకం కింద ఇప్పటికే మంజూరైన ఫామ్ పాండ్స్ పనులను వెంటనే ప్రారంభించి, వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో లేబర్ సంఖ్యను గణనీయంగా పెంచి, ప్రతి గ్రామపంచాయతీలో లక్ష్యాలకు అనుగుణంగా కార్మికులను సమీకరించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీఓ జాకీర్ హుస్సేన్, ఏపీవో సంతోష్ కుమార్, ఈసీ నవాజుద్దీన్, టెక్నికల్ అసిస్టెంట్లు , పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.