ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కలిసిన బీఆర్‌ఎస్ నాయకులు
- జన్మదిన కానుకగా సన్మాన పత్రం అందజేత
విశ్వంభర, సూర్యాపేట: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో 23వ వార్డు బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి వల్దాస్ స్పందన కిరణ్ మర్యాదపూర్వకంగా కలిసి, జన్మదిన కానుకగా సన్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, 23వ వార్డు అధ్యక్షుడు ఏర్పుల కిరీటి, సీనియర్ నాయకులు వల్దాస్ ఉపేందర్, వీర్జల వేణు బలరాం తదితరులు పాల్గొన్నారు