సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు 

సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు 

విశ్వంభర, సూర్యాపేట: జిల్లా కేంద్రంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి సాయి బాబా దేవాలయం లో మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదితతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జీవితాల్లో గురువు స్థానం కీలకమని అజ్ఞానమని చీకటిని పారద్రోలి జ్ఞానాన్ని  ప్రసరింపజేసేది గురువని జ్ఞానానికి నిజమైన మార్గదర్శి గురువేనని పేర్కొన్నారు. గురువులు అందించే బోధనలు, మార్గదర్శకత్వం కేవలం వ్యక్తిగత వికాసానికే కాక సమాజ అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడతాయన్నారు. సాయిబాబా చూపిన సత్యం, దయ, కరుణ, అనుసరణీయమన్నారు.ప్రతి ఒక్కరూ గురువులను గౌరవిస్తూ, వారు చూపిన సన్మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. సాయిబాబా ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, పాడిపంటలు, వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్లు కొణతం రాజేష్ రెడ్డి, కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, షేక్ జహీర్, గుణగంటి హేమ సతీష్, కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా,ధరావత్ వీరన్న నాయక్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, సాయిబాబా దేవాలయం సెక్రటరీ మిరియాల సుధాకర్, ట్రెజరర్ పోతుగంటి మల్లికార్జున్, వెంపటి ప్రభాకర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బెలిదే శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగేల్లి అరుణ్ కుమార్, నరేష్ పిళ్లే, రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/special-pujas-at-saibaba-temple/article-20268

Tags: