kacham satyanarayana : తక్షణమే ఆర్య వైశ్య కార్పోరేషన్ కు రూ.500 కోట్లు నిధులు విడుదల చేయాలి.

- వైశ్య వికాస వేదిక చైర్మన్ డా కాచం సత్యనారాయణ గుప్త.

 వైశ్యులను నిర్లక్ష్యం చేస్తే - జిహెచ్ఎంసి ఎన్నికల్లో మా సత్తా చూపుతాం. 

విశ్వంభర, హైదరాబాద్ :-  వైశ్య కార్పోరేషన్ ఏర్పాటై రెండు సంవత్సరాలు గడిచినా  నిధులు కేటాయించకపోవడం చాలా దారుణమని వైశ్య వికాస వేదిక చైర్మన్ డా కాచం సత్యనారాయణ గుప్త ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత నిరుపేద వైశ్యుల జీవితాలు బాగుపడుతాయని అనుకున్నాము.. గత ప్రభుత్వం  7 కార్పొరేషన్లు 11 మున్సిపల్ చైర్మన్లు 1 ఎమ్మెల్యే, 1 ఎమ్మెల్సీ 1 ఆర్ టి ఏ కమిషనర్ ను కేటాయించిందని అన్నారు.  ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం  ఒక కార్పొరేషన్ కు చైర్మన్ ను నియమించి చేతులు దులుపుకుని ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ నిధుల సాధనకై ఆగస్టు 3న ఇందిరా పార్కు వద్ద నిర్వహించనున్న సాధన దీక్ష పోస్టర్ ను బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారయణ ఆవిష్కరించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం నామమాత్రంగా ఆర్యవైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేశారు కానీ నిధులు కేటాయించడంలో విఫలమయ్యారని తెలిపారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికై ప్రభుత్వాలు ఎప్పుడు మొండిచెయ్యి చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కేవలం ఓ వర్గపు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు కానీ ప్రభుత్వాలు మాత్రం తమను పట్టించుకోవడం లేదని చెప్పారు. గతంలో వైశ్య వికాస వేదిక నుండి వైశ్య గర్జన నిర్వహించి కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైశ్యులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు.

 ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ కు ఐదు వందల కోట్లు తక్షణమే విడుదల చేసి 15మంది సభ్యులతో కూడిన  డైరెక్టర్లను నియమంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించకపోతే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు.  వెంటనే ప్రభుత్వం ఆర్యవైశ్యులను గుర్తించి తమ కార్పోరేషన్ తగ్గ నిధులు విడుదల చేయాలని వైశ్య వికాస వేదిక చైర్మన్ డా కాచం సత్యనారయణ గుప్త డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముక్క సాంబశివరాజు , నంగునూరు రమేష్, కొత్త రవికుమార్ గుప్త , కాసం  ఏక సాయి, గజవాడ సత్యనారాయణ, బుక్క మనోహర్ , మురళి, సంతోష్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/kacham-satyanarayana-should-immediately-release-funds-of-rs-500-crores/article-20343

Tags: