నాలాలో పడి గల్లంతైన వృద్ధుడి కోసం హైడ్రా గాలింపు
విశ్వంభర, హైదరాబాదు : హఫీజ్‌పేట, మదీనాగూడ వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలోని వరద కాలువలో పడి గల్లంతైన 70 ఏళ్ల వృద్ధుడి కోసం హైడ్రా బృందాలు రెండో రోజూ గాలింపు చర్యలు కొనసాగించాయి. మంగళవారం రాత్రి సుమారు 9.30 గంటలకు వృద్ధుడు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయినట్లు సమాచారం అందడంతో హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌లు, బాక్స్ డ్రెయిన్‌లలో గాలించినప్పటికీ వృద్ధుడి ఆచూకీ లభించలేదు. గాలింపు చర్యలను హైడ్రా అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ పర్యవేక్షించారు. అధికారులు గాలింపును కొనసాగిస్తున్నారు.