సైదాపూర్ లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
విశ్వంభర, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకేపల్లి గ్రామంలోని సాయిబాబా దేవాలయంలో బుధవారం గురు పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా భక్తులు, మహిళలు తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, పాల్గొన్నారు.