విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక రంగంలోనూ రాణించాలి: వి. కుమార్
విశ్వంభర, రాంనగర్ : విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక రంగంలోనూ విద్యార్థులు రాణించినప్పుడే వారిలో మానసిక పరిపక్వత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని శ్రీ చైతన్య కళాశాల ఏజీఎమ్ వి. కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాదు ఆర్టీసీ కళ్యాణ మండపంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య స్నేహభావం, పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాశాల డీన్ శివకుమార్, ప్రిన్సిపాల్స్ మాధవరావు, సరస్వతి, వర్దిని, అన్నపూర్ణ రెడ్డి, ప్రసాద్ పాల్గొని విద్యార్థులను అభినందించారు.