ఎస్‌ఐఆర్ ప్రక్రియలో 83.73 శాతం ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తి
విశ్వంభర, షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జూలై 29 మధ్యాహ్నం 12 గంటల వరకు అందిన ఏఈఆర్‌ఓల నివేదిక ప్రకారం, నియోజకవర్గంలో మొత్తం 2,44,426 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,04,662 మంది ఓటర్ల వివరాలు డిజిటలైజ్ అయ్యాయి. దీంతో 83.73 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది.మండలాల వారీగా పరిశీలిస్తే, కొందుర్గు లో 91.22 శాతం, కేశంపేటలో 90.15 శాతం, జిల్లేడ్-చౌదరిగూడలో 89.76 శాతం, ఫరూక్‌నగర్ రూరల్‌లో 88.29 శాతం, కొత్తూరులో 88.15 శాతం, నందిగామలో 86.69 శాతం డిజిటలైజేషన్ పూర్తయ్యింది. కాగా, షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 65.13 శాతం మాత్రమే పూర్తవడంతో అక్కడ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా 2,27,765 మంది ఓటర్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తికాగా, మొత్తం పురోగతి 93.18 శాతానికి చేరుకుంది. ఇంకా 16,661 మంది ఓటర్ల డిజిటలైజేషన్ పెండింగ్‌లో ఉంది. వీరిలో అత్యధికంగా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 10,847 మంది, ఫరూక్‌నగర్ రూరల్‌లో 2,148 మంది, నందిగామలో 1,567 మంది, కొత్తూరులో 1,086 మంది ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ కోసం పెండింగ్‌లో ఉన్నాయి.ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఓటర్ల వివరాల మ్యాపింగ్, డిజిటలైజేషన్ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్‌ఏలు పూర్తి సహకారం అందించాలని షాద్‌నగర్ ఆర్డీవో సరిత కోరారు.