నీటి సంరక్షణపై అవగాహన కల్పించిన సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ

విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామపంచాయతీలో జలశక్తి అభియాన్‌లో భాగంగా జలసిరి ప్రత్యేక గ్రామసభను సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పెంపు, చెరువులు, కుంటల పునరుద్ధరణ, నీటి వృథా నివారణ, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్రతి నీటి బొట్టును సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, "జలమే జీవం – ప్రతి బొట్టు అమూల్యం", "నీటిని కాపాడుదాం.. భవిష్యత్తును సురక్షితం చేద్దాం" అనే నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పులిమామిడి జనార్దన్ గౌడ్, గ్రామ కార్యదర్శి వేణు, వార్డు సభ్యులు కాసాని శ్రీనివాస్ గౌడ్, తిరుమలి యాదయ్య, బొజ్జం మల్లేష్, ఎర్ర భాను, బొజ్జం మంగ, గూడెపు రాధ, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/-draft--add-your-title/article-20339

Tags: