అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

  • గొలుసు దొంగతనం కేసులను ఛేదించిన కేశంపేట్ పోలీసులు

విశ్వంభర, షాద్‌నగర్: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధితో పాటు మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో వరుస గొలుసు దొంగతనాలు, మోటార్‌సైకిల్ చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠాను కేశంపేట్ పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వెల్లడించారు. షాద్‌నగర్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన సుఖ్‌దేవ్ సింగ్ (38), షంషేర్ సింగ్ (36), మనుప్రీత్ సింగ్ (24)లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు బంగారు మంగళసూత్రాలు, ఒక మోటార్‌సైకిల్, మూడు మొబైల్ ఫోన్లు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కూలి పనుల నెపంతో గ్రామాల్లో సంచరిస్తూ వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని మోటార్‌సైకిల్‌పై వచ్చి గొలుసులు లాక్కెళ్లడంతో పాటు మహిళలను తోసివేసి బంగారు పుస్తెలతాడును అపహరించినట్లు పోలీసులు తెలిపారు. హార్వెస్టర్ మిషన్ ఆపరేటర్లుగా పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాలపై అవగాహన పెంచుకున్న నిందితులు, చోరీ చేసిన మోటార్‌సైకిళ్లతో వరుస నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. మరో నేరానికి సిద్ధమవుతున్న సమయంలో కేశంపేట్ క్రాస్‌రోడ్ వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ఇటీవల షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హెచ్‌బీ బై నైట్ కేసును కూడా పోలీసులు ఛేదించి 18 తులాల బంగారం, 7 తులాల వెండి, రూ.30 వేల నగదు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పలు బైక్ చోరీ కేసులను ఛేదించి మూడు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసులను విజయవంతంగా ఛేదించిన పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు అందజేశారు. సమావేశంలో డీసీపీ శిరీష రాఘవేందర్, ఏసీపీ లక్ష్మీనారాయణ, కేశంపేట్ సీఐ నరహరి, ఎస్‌ఐ రాజ్‌కుమార్, క్రైమ్ టీం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/gang-of-interstate-thieves-arrested/article-20298

Tags: