నల్లపోచమ్మ, మహంకాళి దేవి బోనాల ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు
విశ్వంభర, బషీర్ బాగ్: ఆగస్టు 9న నిర్వహించనున్న నల్లపోచమ్మ దేవి, శ్రీ మహంకాళి దేవి మందిరం కమిటీ నటరాజ్ నగర్ సబ్జి మండి లో బోనాల మహోత్సవం సందర్భంగా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. అందులో భాగంగా డీసీపీ రాఘవేంద్ర రెడ్డి, ఏసిపి పి. తిరుపతి, ఎస్ హెచ్ ఓ కుంసింపుర సిఐ రాములు, ఎస్ హెచ్ ఓ టపాచపుత్ర బాలకృష్ణ , మాజీ కార్పొరేటర్ మండగిరి స్వామి లు జిహెచ్ఎంసి, వాటర్ వర్క్, ఎలక్ట్రిషన్స్, ఎండోమెంట్ వాళ్లతో పాటు వివిధ శాఖల అధికారులు బోనాల ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు దోర్తుల శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శి ఆనంద్ దేశి వేణుబాబు, ఉమ్మడి బోనాల కమిటీ అధ్యక్షులు కట్ట లింగం, ప్రధాన కార్యదర్శి అల్లే రామ్ కుమార్, ఉమ్మడి బోనాల గౌరవ సలహాదారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.