మెక్ డోవెల్  కాలనీలో గురు పౌర్ణమి వేడుకలు 

విశ్వంభర, బోడుప్పల్:  బోడుప్పల్ సర్కిల్ మెక్ డోవెల్ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ అజయ్ యాదవ్, సీనియర్ నాయకులు ఆలయ సలహాదారు బొమ్మకు బాలయ్య,11వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మక్ కళ్యాణ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సుమన్  నాయక్,కృపా సాగర్ పాల్గొని శ్రీ సాయి నాథుడిని దర్శించుకున్నారు. ఆలయ పాలకమండలి ప్రతి సంవత్సరం లానే ప్రత్యేక పూజలు నిర్వహించి, సాయినాధుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు 1,000 మందికి పైగా పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయని ఆలయ ప్రధాన కార్యదర్శి వెల్లంకి శ్రీనివాస్ తెలిపారు

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/guru-poornami-celebrations-at-mc-dowell-colony/article-20244

Tags: