వర్షాల కోసం నాభి శిల, బొడ్రాయికి జలాభిషేకం

విశ్వంభర, హైదరాబాద్: ఎల్ నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, అనాదిగా రాజుల కాలం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని అనుసరిస్తూ సుంకేనపల్లి గ్రామంలో నాభి శిల, బొడ్రాయికి ప్రత్యేక జలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆవుల సునీత, యాదయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బిందెలతో నీటిని తీసుకొచ్చి నాభి శిల, బొడ్రాయిపై అభిషేకం నిర్వహించి, అనంతరం బతుకమ్మలు ఆడుతూ వాన దేవుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొసనం శేఖర్, వార్డు సభ్యులు రజిని, నాగవాచారి, మాచగిరి, లింగస్వామి, లింగామయ్య, యాదమ్మ, రాజు, వెంకటేష్, సోనీ, మాజీ సర్పంచ్ కక్కిరేణి బొందయ్యతో పాటు గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే భగవంతుని కృపతో గ్రామంలో కుండపోత వర్షం కురవడం విశేషంగా నిలిచింది. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ సంప్రదాయ ఆచారంపై తమ విశ్వాసాన్ని మరోసారి చాటుకున్నారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/jalabhisheka-to-navel-rock-for-rains/article-20337

Tags: