ఒక్కొక్కరం ఒక మొక్క నాటుదాం... పచ్చని గ్రామాన్ని నిర్మిద్దాం
- : సర్పంచ్ హేమలత నరేందర్రావు
విశ్వంభర, చింతపల్లి: మండలంలోని ఘడియ గౌరారం గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉజ్జిని హేమలత నరేందర్రావు పాల్గొని గ్రామ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ ఉజ్జిని హేమలత నరేందర్రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని ఆమె గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. వర్షాకాలం మొక్కలు నాటేందుకు అనువైన సమయమని, ప్రతి ఇంటి ఆవరణలో, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల వెంట విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు పెంచడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గడంతో పాటు భూగర్భ జలాలు పెరగడం, జీవ వైవిధ్యం పరిరక్షించబడడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. "ఒక్కొక్కరం ఒక మొక్క నాటుదాం... పచ్చని గ్రామాన్ని నిర్మిద్దాం" అనే నినాదంతో గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు. ప్రతి మొక్కను ఒక కుటుంబ సభ్యుడిలా భావించి సంరక్షిస్తేనే పచ్చని, పరిశుభ్రమైన గ్రామం సాకారం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అదిరాల కృష్ణయ్య, వార్డు సభ్యులు నాగమళ్ళ కవిత యాదగిరి, గుండెబోయిన సైదులు, షేక్ సైదా బేగం మస్తాన్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, టీఏ యాదయ్య, డా. మనీషా, ఇంచార్జి హెడ్ మాస్టర్ వాణి, సంఘం సభ్యులు మమత, వీవో సరిత, బిందు అంగన్వాడీ టీచర్స్, రైతులు బూడిద చంద్రయ్య, జక్కుల వెంకటయ్య, నారిమళ్ళ ప్రకాష్, తుళ్ళ రమేష్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.