నీటిని వృథా చేయొద్దు.. ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి
- జలసిరి గ్రామసభలో ఎంపీడీవో శారదమ్మ, సర్పంచ్ నవీన్ పిలుపు
విశ్వంభర, మహేశ్వరం: తెలంగాణ ప్రభుత్వ జలసిరి కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మునగపాటి నవీన్ ఆధ్వర్యంలో జలసిరి గ్రామసభ నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో శారదమ్మ మాట్లాడుతూ, నీటి ప్రతి చుక్కను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భూగర్భ జలాల పెంపునకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తోందని తెలిపారు. సర్పంచ్ నవీన్ మాట్లాడుతూ, వర్షపు నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని, తాగునీటిని అవసరానికి మించి వృథా చేయొద్దని సూచించారు. రైతులు డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగునీటి విధానాలను వినియోగించడంతో పాటు బోర్ రీచార్జ్ గుంతలు, ఫామ్ పాండ్లు ఏర్పాటు చేసుకుని భూగర్భ జలాలను పెంచాలని కోరారు. అలాగే చెరువులు, కుంటల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జొరల రమేశ్, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.