ఎల్-నినో ప్రభావాలపై మండలస్థాయి అవగాహన సదస్సు

విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఆదేశాల మేరకు ఎల్-నినో ప్రభావాలు, ముందస్తు సంసిద్ధత చర్యలు, వివిధ శాఖల సమన్వయంపై మండలస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి (డిప్యూటీ సీఈఓ) శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఎల్-నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీటి సంరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగం, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారి జగన్నాథ్‌రావు, ఎంపీడీవో జి. జలందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీ ఎల్-నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, చెరువులు, కుంటలు, బోర్‌వెల్ల నిర్వహణ, నీటి పొదుపు, తక్కువ నీటితో సాగు చేసే పంటలు, పశువులకు తాగునీరు, పశుగ్రాసం, వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో తహసీల్దార్ దశరథ్ నాయక్, వివిధ శాఖల అధికారులు, మండలంలోని సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామసభలు, అవగాహన ర్యాలీలు, కరపత్రాలు, మైకింగ్ ద్వారా ప్రజల్లో ఎల్-నినో ప్రభావాలు, నీటి సంరక్షణ, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై విస్తృత ప్రచారం చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/zonal-awareness-conference-on-el-nino-impacts/article-20265

Tags: