సాయిబాబా దేవాలయంలో ఘనంగా గురుపౌర్ణమి ఉత్సవాలు
విశ్వంభర, బోడుప్పల్: బోడుప్పల్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని సాయిబాబాకు ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం, పాలాభిషేకం, అర్చనలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య హారతి కార్యక్రమాలు నిర్వహించగా, అనంతరం సాయినామ సంకీర్తనలు, భజనలు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపాయి. మధ్యాహ్నం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 2,000 నుంచి 2,500 మంది భక్తులు పాల్గొని మహాప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా గురుపౌర్ణమి విశిష్టతను వివరిస్తూ, గురువు చూపిన మార్గంలో నడవాలని, జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఉత్సవాల నిర్వహణకు ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, సేవాదళ సభ్యులు విశేషంగా సహకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు తోటకూర చందర్ యాదవ్, దొంతి లింగం, తోటకూర రవీందర్ యాదవ్, కీసరి శేఖర్ రెడ్డి, ఏ. శివకుమార్, సురేందర్ చారి, వీర చందర్, శ్రీనివాస్, వై. వెంకటేశ్వరరావు, పి.ఎల్. మధుసూదన్, డాక్టర్ రాంచందర్, ప్రభాకర్ పంతులు, సాయి పంతులు, నాగుల లక్ష్మి, సాయి కుమారి, జనతా గారాజీ, చంద్రలు, లీల, హేమ, లక్ష్మి, లలిత రెడ్డి, పద్మ, శృతి, శ్యామలమ్మ, ఉమా, లావణ్యతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.