భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
- అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: తహసీల్దార్ శ్రీనివాసులు
విశ్వంభర, ఇనుగుర్తి: రానున్న 36 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇనుగుర్తి తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు సూచించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. నదులు, వాగులు, చెరువులు, కాలువల వద్దకు వెళ్లకుండా, నీటి ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించవద్దని ప్రజలను హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో సురక్షిత తాగునీటి సరఫరా, విద్యుత్ అంతరాయం ఏర్పడితే ఆస్పత్రుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, గర్భిణులను ముందుగానే ఆస్పత్రులకు తరలించడం వంటి చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. రైతులకు అవసరమైన సూచనలు అందించడంతో పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీడీవో, జీపీవో, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తహసీల్దార్ సూచించారు