ఇందిరమ్మ ఇండ్లపై అడిషనల్ కలెక్టర్ సమీక్ష

విశ్వంభర, నెల్లికుదురు: మండల కేంద్రం నెల్లికుదురులోని మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా ఇన్చార్జ్ అడిషనల్ కలెక్టర్, సీఈవో పురుషోత్తం ఎంపీడీవో సింగారపు కుమార్ తో కలిసి బుధవారం పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ ఏఈ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ గుడిసెల్లో నివసిస్తున్న వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, వ్యవసాయ కుంటలు,సమగ్ర ప్రణాళికపై వివరాలను అడిగి తెలుసుకొని ఆరా తీశారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరిలో పారదర్శకత పాటించాలని సూచించారు. ఇప్పటికే మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో వ్యవసాయ కుంటలలో నీటి నిల్వ ఎంత ఉంది,రాబోయే వర్షాలకు వాటి సామర్థ్యం పై సమాలోచన చేశారు. గ్రామపంచాయతీల సమగ్ర ప్రణాళిక పై రూపొందించిన వివరాలు, నిర్వహిస్తున్న పనులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ అనిల్ వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/additional-collector-review-of-indiramma-houses/article-20286

Tags: