బేతోజు సత్యనారాయణ శాస్త్రి దంపతులకు సన్మానం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలోని  గురువు బ్రహ్మశ్రీ బేతోజు సత్యనారాయణ శాస్త్రి దంపతులను చందేపల్లి దేవాలయ అర్చకులు ఆకుల కోటేశ్వర్-రమ్య దంపతులు గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా సన్మానించినారు. అనంతరం బ్రహ్మశ్రీ బేతోజు సత్య నారాయణ శాస్త్రి మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో మనం ఏ స్థానంలో ఉన్నా, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ప్రతిరోజు మనస్ఫూర్తిగా తల్లిదండ్రులతో సమానంగా వారిని పూజించాలని, వారి సేవలను ప్రతినిత్యం గుర్తుకు చేసుకోవాలని తెలిపినారు. అనంతరం వారి ప్రియ శిష్యులైన చందేపల్లి దేవాలయ అర్చకులు ఆకుల కోటేశ్వర్-రమ్య దంపతులను జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించినారు. అనంతరం బేతోజు సత్యనారాయణ శాస్త్రి సిద్ధాంతి చేతుల మీదుగా సర్వ కంకణం పండిట్ ఆకుల కోటేశ్వర్ కు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శశిధర్ పంతులు, సామాజిక కార్యకర్త నోముల యాదగిరి, గ్రామ పెద్దలు వల్లె వెంకటరెడ్డి దంపతులు, బత్తుల కోటీశ్వర్ రెడ్డి, బత్తుల సులోచన, కొయిగూరి లక్ష్మమ్మ, తొలి అక్షరం రిపోర్టర్ నోముల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tribute-to-betoju-satyanarayana-shastri-couple/article-20315

Tags: