బోడుప్పల్ రాజీవ్ నగర్ కాలనీలో వరద నీరు
- : స్పందించిన కమిషనర్ వెంటనే డ్రైనేజీ అవుట్ లెట్ ప్రారంభం
విశ్వంభర, బోడుప్పల్: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్లోని రాజీవ్ నగర్ కాలనీలో నిన్న కురిసిన వర్షాల కారణంగా డ్రైనేజీ అవుట్లెట్ ద్వారా వెళ్లవలసిన వరద నీరు సరైన అవుట్ లైట్ లేక కాలనీలో నిలిచిపోయాయి. కానీ ఇంతకుముందు కేంద్రీయ ఔషధ మొక్కల పరిశోధన కేంద్రం లోకి వెళ్లేవి, కానీ వారు ప్రహరీ గోడ నిర్మించడంతో వర్షపు నీరు దిగువ ప్రాంతాలకు వెళ్లే వీలు లేక ఎక్కడికి అక్కడే నీరు నిలవడం వలన ఇళ్లలోకి చేరాయి. రాజీవ్ నగర్ కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక సీనియర్ నాయకులు దానగల్ల యాదగిరి అక్కడి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ కి ఫోన్ ద్వారా అక్కడి పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన డిప్యూటీ కమిషనర్ 51 లక్షల వ్యయంతో తీర్మానంలో ఉన్న డ్రైనేజీ అవుట్లెట్ పనులను త్వరగా జరిగే విధంగా అమలు చేశారు. డ్రైనేజ్ విస్తీర్ణాన్ని పెంచి పైపులను తెప్పిచ్చి వెంటనే డ్రైనేజీ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. త్వరగా స్పందించి సహకరించిన డిప్యూటీ కమిషనర్ను, సీనియర్ నాయకులు దానగల్ల యాదగిరి నీ కాలనీవాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గోపురాము, వేణు యాదవ్, యూత్ ప్రెసిడెంట్ గడ్డి రమేష్, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్,కాలనీవాసులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.