గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్
విశ్వంభర, హుస్నాబాద్: హుస్నాబాద్ మండలంలోని అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, మంజూరైన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మంత్రి, ముందస్తు సమాచారం లేకుండా సమావేశానికి గైర్హాజరైన విద్యుత్ శాఖ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభలకు హాజరుకాని అధికారులపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శాతవాహన యూనివర్సిటీకి విద్యుత్ కనెక్షన్ ఆలస్యంపై అధికారులను నిలదీసి, వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. మండలంలో మంజూరైన 240 ఇందిరమ్మ ఇండ్లలో 210 ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని అధికారులు వివరించగా, మిగిలిన పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల పెండింగ్ పనులను వేగవంతం చేయడంతో పాటు పొట్లపల్లి, పందిళ్ల, కోహెడ రూట్లలో ఆర్టీసీ బస్సు సర్వీసులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, రైతులకు ఆరుతడి పంటలు, ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీఛార్జ్ పిట్లు ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంచాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ కొండల్ రెడ్డి, ఎంపీడీఓ సురేష్, ఏఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ శివయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.