గాయపడిన మున్సిపల్ కార్మికుడికి ఆర్థిక సాయం
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుడు కొండేటి సతీష్ వారం రోజుల క్రితం బైక్ అదుపుతప్పి కిందపడడంతో కాలుకు తీవ్ర గాయమై విరిగింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న సతీష్‌కు అండగా నిలిచిన యునైటెడ్ హాండ్స్ గ్రూప్ సభ్యులు కలిసి రూ.16,700 ఆర్థిక సహాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రూప్ సభ్యుల సహృదయతను అభినందించిన కొండేటి సతీష్, తన క్లిష్ట సమయంలో అండగా నిలిచి ఆర్థిక సాయం చేసిన యునైటెడ్ హాండ్స్ గ్రూప్ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అవసరంలో ఉన్న వారికి ఎంతో ధైర్యాన్ని, భరోసాను కల్పిస్తాయన్నారు