హనుమాన్ ఆలయ నిర్మాణానికి బీఆర్ఆర్ ఫౌండేషన్ విరాళం

:500 సిమెంట్ బ్యాగులు అందజేసిన బూడిద రాంరెడ్డి 

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: యాచారం మండలం, నక్కర్తమేడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయ నిర్మాణానికి బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి  ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామస్తులు నేడు బూడిద రాంరెడ్డి వ్యక్తిగత కార్యాలయంలో ఆయనను కలిసి దేవాలయ అభివృద్ధి కోసం తమ వంతు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ నిర్మాణానికి సిమెంట్ అవసరం ఉందని వారు వివరించారు. వారి వినతికి తక్షణమే స్పందించిన బిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి ఆలయ నిర్మాణానికి 500 సిమెంట్ బ్యాగులుఅందజేస్తామని హామీ ఇచ్చారు. భక్తుల మనోభీష్టం మేరకు ఆలయ నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా బూడిద రాంరెడ్డి మాట్లాడుతూ, భక్తి, సంస్కృతిని కాపాడేందుకు దేవాలయాల నిర్మాణం చాలా ముఖ్యం. నక్కర్తమేడిపల్లి గ్రామస్తుల భక్తి భావానికి నేను కూడా సహకరించడం గర్వంగా ఉంది. బిఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సామాజిక, ధార్మిక కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ టెంపుల్ చైర్మన్ చిందం అంజయ్య, సురేందర్ రెడ్డి, శ్రీశైలం, ఐలయ్య, రాజు, తదితరులు పాల్గొన్నారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/brr-foundation-donation-for-construction-of-hanuman-temple/article-20282

Tags: