హుస్నాబాద్‌లో బీజేపీ సర్ ప్రవాస్ అభియాన్

  • పోలింగ్ బూత్‌ల పెంపునకు ఆర్డీఓకు వినతి

విశ్వంభర,  హుస్నాబాద్:  బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న సర్ ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, పట్టణ ప్రవాస్ అభియాన్ సంయోజక్ ఖమ్మం వెంకటేశం 24 గంటలపాటు పర్యటించి పార్టీ కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తిని కలిసి, పట్టణంలో ఓటర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా కొత్త పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసి, బూత్‌ల సంఖ్యను పెంచాలని వినతిపత్రం అందజేశారు. ప్రవాస్ అభియాన్‌లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం సాయంత్రం వరకు పట్టణంలోనే బస చేసిన ఖమ్మం వెంకటేశం, బీజేపీ కార్యకర్తలు, బిఎల్ఏ-2లు, బూత్ కమిటీ సభ్యులతో కలిసి ఎనిమిది ప్రాంతాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కార్యకర్త ఇంట్లో భోజనం చేసి, రాత్రి బస చేశారు. సంఘ్ పరివార్ ప్రతినిధులతో సమావేశమై సర్ పై, అనంతరం నాయకులతో కలిసి పార్టీ బలోపేతంపై చర్చించారు. బూత్ కమిటీల పనితీరును సమీక్షిస్తూ 24 గంటల ప్రవాస్ అభియాన్‌ను ముగించారు. ఈ సందర్భంగా ఖమ్మం వెంకటేశం మాట్లాడుతూ బూత్ కమిటీలే భారతీయ జనతా పార్టీకి వెన్నెముక అని అన్నారు. ప్రతి కార్యకర్త తన పరిధిలోని ప్రతి కుటుంబాన్ని కలిసి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల విశ్వాసాన్ని పొందాలని, యువత, మహిళలు, రైతులు, మేధావులు సహా అన్ని వర్గాల ప్రజలను పార్టీతో అనుసంధానం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు లక్కిరెడ్డి తిరుమల, తోట స్వరూప, మాజీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, నాయకులు తగరం లక్ష్మణ్, రాయికంటి చందు, తోట సమ్మయ్య, ఎర్రవెల్లి ప్రశాంత్, పెందోట భూశంకరాచారి, ఇల్లందుల తిరుపతి, బొడిగే వెంకటేష్, ఎర్రోజు సాయికృష్ణ, నందకుమార్, వరియోగుల మురళీధరస్వామి, విలసాగరం మురళీమోహన్, బూత్ అధ్యక్షులు, బిఎల్ఏ2లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bjp-sir-pravas-abhiyan-in-husnabad/article-20327

Tags: