పేపర్ లీకేజీ నిరోధక చట్టాన్ని ఇండియా కూటమి వ్యతిరేకించడం దురదృష్టకరం

విశ్వంభర, రామన్నపేట:  పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేపర్ లీకేజీ నిరోధక చట్టాన్ని కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకించడం దురదృష్టకరమని  యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. ఈ చట్టం ద్వారా పేపర్ లీకేజీలకు పాల్పడే వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా, వ్యవస్థీకృత ముఠాలకు కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కేసుల వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ చట్టానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టాలు అవసరమని, ఇలాంటి బిల్లును వ్యతిరేకించడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ చట్టాన్ని ప్రజలంతా స్వాగతించాలని, పేపర్ లీకేజీలకు పాల్పడే వారిలో భయాన్ని కలిగించేలా ఈ చట్టం ఉపయోగపడుతుందని బీజేపీ తరఫున పేర్కొన్నారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/it-is-unfortunate-that-the-india-alliance-opposes-the-anti-paper/article-20313

Tags: