రాయపర్తి బీఎల్‌ఏల పనితీరుపై ఎమ్మెల్యే సమీక్ష

విశ్వంభర, పాలకుర్తి : రాయపర్తి మండల బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) పనితీరుపై పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి బుధవారం పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఓటరు జాబితా నిర్వహణ, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై బీఎల్‌ఏలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఇంటింటి సర్వేను క్షుణ్ణంగా నిర్వహించి కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణ, మార్పులు, చేర్పులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజలతో నిరంతరం మమేకమై ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో బీఎల్‌ఏల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 30 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-review-on-performance-of-rayaparthi-blas/article-20235

Tags: